సాధార‌ణంగా ఆకాక‌ర కాయ‌ల‌కు వినియోగదారుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంటుంది. రుచికి చేదైనా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది కాకర. అలాంటి కాకరనే మించింది బోడకాకర. ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే ఆకాకర కాయల్నే బోడ కాకర అని కూడా పిలుస్తుంటారు.  అటవీ ప్రాంతంలో ఎక్కువగా దొరికే ఈ బోడ కాకర కాయలకు పట్టణాల్లో కూడా భలే డిమాండ్‌ ఉంటుంది. దీని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా మెండుగానే ఉంటాయి.


వీటిలో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మధుమేహంతో బాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది. 


రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.  ఆకాకరకాయలోని విటమిన్‌ 'సి' శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే  క్యాన్సర్ల బారిన పడకుండా కూడా అడ్డుకుంటుంది. మ‌రియు దీనిలో లభించే విటమిన్‌ 'ఎ' కంటి చూపునకు మేలు చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: