ఎనిమిది అంతస్తులుగా నిర్మించిన ప్రధాన భవనం డిజైన్‌లోనే లోపం ఉన్నట్లు సంబంధిత ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.అది సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి.ఈ ఏడాది ఆగస్ట్‌ 8 వ తేదీన గాంధీ పిడియాట్రిక్‌ సర్జరీ ప్రిపరేషన్‌ వార్డులో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు వార్డులో చిన్నారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

 

కానీ ఆస్పత్రిలో ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇక్కడ ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

అగ్నిప్రమాదం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఆయా వార్డుల నుంచి బయటపడేందుకు వెలుపల వైపుకు తప్పనిసరిగా మెట్లు ఏర్పాటు చేయాలి. అయితే నాలుగు వైపులా బంధించినట్లు ఇన్‌పేషెంట్‌ వార్డు భవనాన్ని నిర్మించారని, ర్యాంపుతోపాటు మూడు చోట్ల మెట్లు ఉన్నప్పటికీ, వాటి దారులన్ని భవనం లోపలికే ఉండడంతో ప్రమాదం జరిగితే బయటపడే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఫైర్‌ ఎగ్జిస్టింగ్‌ మిషన్‌లు కొన్నిచోట్ల ఉన్నప్పటికీ వాటిని ఎలా వినియోగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అన్ని విభాగాలను కలుపుకుంటే గాంధీఆస్పత్రికి నిత్యం సుమారు 18 నుంచి 20 వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు.గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తరుచు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.

 

గాంధీ ఆస్పత్రిలో అగ్నిమాపక రక్షణ వ్యవస్థ పనిచేయడంలేదని ప్రభుత్వంతోపాటు, వైద్యఉన్నతాధికారులు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లాం. ఫైర్‌ఫైటింగ్‌ సిస్టం, స్మోక్‌ డిటెక్టివ్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరాం అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: