భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి వరి. అయితే అన్నమంటే తెల్లగా మల్లెపువ్వులా నాజూగ్గా పొడిపొడిలా ఉండాలి. కానీ నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపద ఇంకేదీ లేదు. తెల్లబియ్యంతో పోలిస్తే నల్లబియ్యంలో 'బి' 'ఇ' విటమిన్లు, నియాసిన్‌, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింకు వంటి ఖనిజ విలువలూ అధికం. పీచుపదార్థం పుష్కలం. గింజ నమిలిడే కాయధాన్యం రుచి, నల్లబియ్యంలోని ఆంకోసైనిన్స్‌, యాంటిఆక్సిడెంట్లుగా పనిచేయడమే గాక, రోగనిరోధక ఎంజైములను క్రియాశీలం చేస్తాయి.


అదే విధంగా మలబద్ధ నివారణి. నల్ల బియ్యంలో విటమిన్ ఇ ఎక్కువ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఇనుము, జింక్ వంటి ఖనిజ విలువలుంటాయి. బ్లాక్ రైస్‌లో రెండుమూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. డయాబెటీస్ అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సూలెన్స్ లెవెల్స్‌ను ఈ బియ్యం తగ్గించడంవల్ల ఒబెసిటీ సమస్య కూడా తగ్గినట్లే. 


ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా అందంగా ఉంటాయి. గంజిని ముఖానికి మాస్క్‌గా రోజు వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి. క్యాన్సర్‌ కారక కణాల నిర్మూలన ద్వారా ఈ నల్లబియ్యం క్యాన్సర్‌ కణాలు వ్యాప్తిచెందకుండా నిరోధిస్తాయని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే న‌ల్ల బియ్యం వ‌ల్ల కంటి వ్యాధులను నయంచేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: