ఒకప్పుడు నాటు మందుల వాడకం ద్వారా కొన్ని రోగాలు పోగొట్టేవారు.. కానీ నాటు ముందు వికటించి జరిగిన ప్రమాదాలు చూడలేక ఇంగ్లీష్ మందులు కనిపెట్టి కాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను సైతం తరిమికొట్టారు.. కానీ మారిన కొన్ని రోగాల తీరు ఎన్ని మందులు వాడినా వైరస్‌లను నివారించలేని పరిస్థితి. ఇలాంటి రోగాలను తగ్గించేందుకు సరికొత్త మందులు అందుబాటులో ఉన్నకూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం., మందులను సరఫరా చేసే 'మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ)' జాబితాలో 1995 నాటి పాత మందులే ఉన్నాయి. 

రోగాలు తగ్గక పోగా ఎన్నో నష్టాలు కలిగిస్తున్న పరిస్థితి.. ఇప్పుడు ఎంఎస్‌ఐడీసీ జాబితా నుంచి పాత తరం మందులను తొలగించి కొత్త మందులను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి కొన్ని కసరత్తులను కూడా పూర్తి చేశారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌లతోపాటు కొన్ని రకాల రోగాలకు సంబంధించిన యాంటీ బయోటిక్స్‌ను కొత్త జాబితాలో చేరుస్తారట. గత రెండు నెలలుగా జరిగిన సమావేశంలో చర్చించిన కొన్ని వైద్య విభాగాల నిపుణుల సూచనలతో 440 రకాల కొత్త మందులని జాబితాలోకి చేర్చాలని నిర్ణయించారు. దీనికి గాను ఈనెల 21, 22 తేదీల్లో ఏపీ ఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు ఏర్పరిచి.. ఏయే మందులు వాడాలో నాలుగైదు రోజుల్లో జాబితాను ఏర్పాటు చేస్తున్నారు..

అనంతరం ఈ జాబితాను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుంది. అయితే ఈ కొత్త మందుల జాబితాపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ.. రోగాలకు పనిచేయని మందులు జాబితాలో ఉన్నా ఉపయోగం లేదని, అందుకే వాటిని తొలగించి కొత్త మందులను ఎంపిక చేస్తామని., కుక్క కాటు (ఏఆర్‌వీ) మందుల కొరతను నివారించేందుకు తొలిసారిగా ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆ మందులను జిల్లాలకు విమానంలో పంపిందని., ప్రణాళికా బద్ధంగా మందులను ఎంపిక చేసి జాబితా ఇస్తే సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని ఎండీ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: