పింటో బీన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంతో రుచిగా వండుకోడానికి ఈజీ గా ఉండే ఈ బీన్స్ గురించి తెలియకపోతే ఎలా చెప్పండి? అందుకే వాటిని మీకు పరిచయం చేస్తున్నాం. చూడటానికి ఇవి  రెగ్యులర్ బీన్స్‌లాగే కనిపిస్తాయి. కానీ రుచి, రంగు,పోషకాల విషయంలో మాత్రం ఇవి చాల ప్రత్యేకం. ఈ గింజలు చూడటానికి ఎరుపు, గోధుమ రంగు తొక్కతో భలే అందంగా ఉంటాయి.  ఇక వండినప్పుడు కొద్దిగా గోధుమ, పాలిపోయిన గులాబీ రంగులోకి మారిపోతాయి. 

వీటిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  కాబట్టి ఖచ్చితంగా వీటిని మీ ఆహారంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యం.  పింటో బీన్స్‌లో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్స్ తో పాటు చాలా విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి.  ఒక కప్పు అంటే సుమారు 171 గ్రాములు పింటో బీన్స్‌ని ఉప్పు వేసి నీళ్లలో ఉడికించి తింటే... 245 కేలరీల ఎనర్జీతోపాటూ... కార్బోహైడ్రేట్స్ 45 గ్రాములు, ఫైబర్ 15 గ్రాములు, ప్రోటీన్ 15 గ్రాములు, ఫ్యాట్ 1 గ్రాము, సోడియం 407 మిల్లీ గ్రాములు లభిస్తాయి. అంతే కాదు ఒక రోజుకి కావాల్సిన  థయామిన్ 28 శాతం, రోజుకి కావాల్సిన  ఐరన్ 20 శాతం,  మెగ్నీషియం 21 శాతం (రోజులో కావాల్సింది), ఫాస్పరస్ 20 శాతం (రోజులో కావాల్సింది), పొటాషియం 16 శాతం (రోజులో కావాల్సింది) లభిస్తాయి. 


విటమిన్ B1 గా పిలవబడే  థయామిన్ మనకు అత్యంత ముఖ్యం. ఇది ఆహారాన్ని ఎనర్జీగా మార్చి మనం రోజంతా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది. అంతే కాదు ఈ  పింటో బీన్స్‌లో జింక్, కాల్షియం కూడా ఉంటాయి. బీపీ ఉన్నవాళ్లు  ఉప్పు లేకుండా కూడా వీటిని ఉడికించుకొని తినవచ్చు.  పింటో బీన్స్ తరచూ తీసుకోవడం వల్ల... జీర్ణ వ్యవస్థ బాగా మెరుగవుతుంది. 


సాధారణంగా  మనకు రోజుకు 25 గ్రాముల ఫైబర్ అవసరం అవుతుంది.కాబట్టి  ముఖ్యంగా మహిళలు ఇవి బాగా తినాలి.- పింటో బీన్స్‌లో వ్యాధినిరోధక శక్తిని కూడా  పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. 
మన శరీరంలో కణాలు చక్కగా ఉండాలంటే వీటిని ఎంచక్కా తినేయాలి. - బ్లడ్ షుగర్ (డయాబెటిస్) కంట్రోల్‌లో ఉండాలంటే పింటో బీన్స్ తినాలి. ఇవి ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: