సాధార‌ణంగా తీరిక సమయంలో చాలామంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్‌ అవడానికి అయితే ఫర్వాలేదు కానీ అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం అంతే సంగ‌తులు. గంటల కొద్దీ టీవీ చూడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటి చెంతకు పేగు కేన్సర్ కూడా చేరిందటు న్నారు ప‌రిశోధ‌కులు. రోజు మొత్తం మీద కదలకుండా ఓ రెండు గంటల పాటు టీవీ చూస్తే పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70 శాతం ఉన్న‌ట్టు ఓ అధ్య యనంలో తేలింది.


తొంభై వేల మంది స్త్రీల మీద.. సుమారు దశాబ్దం పాటు ఈ అధ్యయనం నిర్వ‌హించారు. అయితే పన్నెండు శాతం మంది పేగు కేన్సర్ బారిన పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు వయసున్న వా రు అదే పనిగా టీవీ చూడడం లేదా ఒకేచోట కూర్చోవడం వంటివి చేస్తే ఈ రకం కేన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ‌ట‌. 


అదే విధంగా టీవీ స్క్రీన్ ను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్‌, ఒబెసిటీ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. ఇది కేవలం టీవీ మాత్రమే కాకుండా కంప్యూటర్‌కు కూడా వర్తిస్తుంది. అందుకే ముందు నుంచి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!


మరింత సమాచారం తెలుసుకోండి: