సాధార‌ణంగా ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. ఆవులో సకల దేవతలు ఉంటారని న‌మ్ముతారు. అయితే ఆవు నుంచి వ‌చ్చే అవు పాలలో విటమిన్‌ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆవు పాలు, గేదె పాలు రెండూ పాలే అయినా వాటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆవు పాలు, జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయి.


గేదె పాలు, ఆవు పాలు రెండూ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది గేదె పాలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ నిజానికి ఆవు పాలను తాగడం వల్లే మనకు ఎక్కువగా లాభాలు కలుగుతాయి. గేదె పాలతో పోల్చితే ఆవు పాలు మ‌న‌ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి. ఆవు పాలు చాలా త‌క్కువ ఫ్యాట్‌ను క‌లిగి ఉంటాయి. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అందుకే వాటిని శిశువుల‌కు తాగిస్తారు. పిల్లల కావాల్సిన కాల్షియం ఈ పాల ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. 


జీర్ణాశయ సమస్యలను తొలగించడంలో ఆవు పాలు ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌వారికి ఆవుపాలు డైట్ ప్లాన్‌లో చేర్చుకోవ‌డం చాలా మంచిది. ఆవు పాలలను పిల్లలకు రోజూ తాగిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే అవు పాలు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఆవు పాలలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: