అందంగా.. ఆరోగ్యంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. అయితే దానికి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మ‌న చేతుల్లోనే ఉంది. పౌష్టికాహారంతో పాటు వ్యాయామాలు శ‌రీరానికి చాలా అవ‌స‌రం. అయితే అత్యుత్తమమైన ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి అవకాడో. అలాగే ప్రకృతి ప్రసాదగించిన పండ్లలో అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. ఈ పండు దక్షిణ భారతదేశంలో విరివిగానే పండిస్తున్నా అనేకమందికి తెలియకుండానే ఉండిపోయింది. 


చర్మం ఆరోగ్యంగా కనిపిస్తే అది ఫిట్‌నెస్‌కి సూచనగా చెప్పుకోవచ్చు. అవకాడో చర్మానికి పోషణ, మెరుపునిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మార్చడం, కంటిచూపును మెరుగుపరుస్తుంది. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవకాడో ఫ్రూట్‌ను ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు. అంతేకాక మిల్క్ షేక్స్, ఐస్ క్రీం లలో కూడా ఈ పండు ఉపయోగం ఎక్కువే. 


అవకాడోలో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, A,B,E వంటి విటమిన్లు అధిక కంటెంట్ లో ఉన్నాయి. ఇంకా ఫైబర్స్, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవకాడో ఫ్రూట్ చాలా కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైనది.  అంతేకాదు ఈ పండ్లు తినడంవల్ల కొన్ని వ్యాధులు, రుగ్మతలు కూడా నయమవుతాయి. ఏంటీ ఆక్సిడెంట్స్ అధికంగా వుండడం వల్ల కాన్సర్ వున్నవాళ్ళకూ ఆస్థమా వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: