సాధార‌ణంగా ఎన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ చాలా మంది కీరానే తింటారు. ఎందుకంటే  ఆరోగ్యానికి, సౌంద‌ర్యానికి కీరా చక్కని ఔషధం. దీంట్లో దాదాపు తొంభైశాతం నీరుంటుంది. దాహాన్నీ తీరుస్తుంది. ఇందులో సి విటమిన్లతో పాటూ ఫొలేట్ కూడా ఉంటుంది. ఈ విటమిన్ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కీరలో విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. కాఫీలు, టీలు తాగే బదులు కీర ముక్కలు అప్పుడప్పుడు తింటే చాలా మంచిది.


ఇక ఎప్పుడూ అందుబాటులో ఉండడంతో పాటు అతి తక్కువ ధరకు లభించే వాటిల్లో కీరదోస ఒకటి. అలాగే పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. తలనొప్పిగా అనిపించినా, మత్తుగా ఉన్నట్లున్నా రెండు మూడు కీరా ముక్కలను తింటే ఫ‌లింతం ల‌భిస్తుంది.


అలాగే రాత్రి పడుకునే ముందు కొన్ని కీర ముక్కలు తింటే.. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు వచ్చే తలనొప్పి ఉండదు. హ్యాంగోవర్ కూడా తగ్గుతుంది.  కీరాను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గి తాజాగా ఉంటుంది. క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసేగుణం కీర సొంతం. రోజుకొకటి చొప్పున తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గటానికి కీర ఎంతో ఉపకరిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: