సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభించేవి. వర్షాకాలం సీజను వచ్చిందంటే చాలు పుట్టగొడుగులు విరివిగా దొరుకుతాయి. రుచిలోనే కాకుండా పోషకాలు సైతం సమృద్ధిగా లభించే పుట్టగొడుగుల అంటే ఇష్టపడని వారుండరు. వీటిలో బటర్‌ మష్రూమ్‌, ముత్యపు పుట్టగొడుగు, ఆయస్టర్‌ పుట్టగొడుగు, పాల పుట్టగొడుగు ఇలా ఎన్నో రకాలున్నాయి. ఇక చూసేందుకు ముచ్చటగా ఉండే ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి.


పుట్టగొడుగుల్లో 90 శాతం నీరు ఉంటుంది. వండక ముందు వీటికి 9 కాలరీల శక్తి ఉంటే, ఉడికించిన తరువాత 22 కాలరీల శక్తి వస్తుందని వైద్యులు చెపుతున్నారు. వీటిలో పోటాషియం మెండుగా లభిస్తుంది. ఇది రక్తపోటును నివారిస్తుంది. అలాగే ఇందులో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు. ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి.


పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. పొటాషియం మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధిచెందుతుంది. ఐరన్‌ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి. పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచిదే అయినా, వీటిలో కొన్ని విషపూరితాలు ఉంటాయి. సహజసిద్ధంగా నేల నుండి బయటకు వచ్చేవి మంచిగా ఉంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: