చిన్నప్పుడు జామకాయ దొంగతనం చాల మంది చేసి ఉంటారు. ఎదో పిల్ల వయసులో చేసారు అది వేరే విషయం. కానీ పెద్దయ్యాక కూడా అలాంటి దొంగతనమే పెద్దయ్యాక చేస్తే పిచోళ్లనుకుంటారు. కానీ ఈ సారి ఏ కాయో పువ్వో కొట్టేయటం కాదు ఏకంగా మొక్కనే కొట్టేయటానికి ప్లాన్ వేశారు.  నా మొక్కని కొట్టేయడానికి ప్లాన్ వేశారంటూ  ఖమ్మం జిల్లాలో మొక్కల దొంగతనం కేసు నమోదైంది. 


వినడానికి హాస్యాప్పదంగా ఉన్నప్పటీ ఇది వాస్తవం. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తీనగర్‌కు చెందిన గుమ్మల నాగేశ్వర రావు అనే వ్యక్తి నాటు వైద్యుడు తన పెరట్లో ఉన్న విలువైన ఔషధ మొక్కలను కొందరు దొంగిలించే ప్రయత్నం చేసి..పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  నాగేశ్వర రావు వైద్యం కోసం విలువైన ఔషధ మొక్కలను తన ఇంటి పెరట్లో భద్రంగా పెంచుతున్నాడు. ఆ మొక్కలలో అతి విలువైన నల్ల పసుపు మొక్క ఆకుల నుండి రాత్రి వేళలో నీటి బిందువులు రాలి పడతాయట. 


ఆ నీటిని పట్టుకుని అనారోగ్యంతో వచ్చే వారికి తాగిస్తాడట ఆ నాటు వైద్యుడు.  ఇలా అనేక మంది ఆ ఆకులపై నీటిని తాగి ఆరోగ్యవంతులైనట్లుగా స్థానికంగా ప్రచారం ఉంది. ఈ విలువైన నల్ల పసుపు మొక్క గురించి తెలుసుకున్న కొందరు బేరసారాలు చేశారు.
నాగేశ్వర రావుకి  ఒక్క మొక్కకు 50 లక్షలు నుండి కోటి రూపాయల దాకా ఆఫర్ ఇచ్చారట వాళ్ళు. కానీ దైవ సమానులైన గోస్వామి ఇచ్చిన మొక్కను ప్రజల ఆరోగ్యం కోసం ఉపయోగిస్తామని డబ్బు కోసం అమ్మనని నాగేశ్వరరావు సున్నితంగా తిరస్కరించారట.


అలా చాలా మంది ఆ మొక్కను కొనేందుకు ప్రయత్నించి వెనుదిరిగి వెళ్లిపోయారట. ఈ క్రమంలోనే ఎలాగైనా నల్ల పసుపు చెట్టును పొందాలని కొందరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని, అది తాము గమనించటంతో వారి ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పారు. 
ఔషధ మొక్కల దొంగతనంపై నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: