చిన్నగా, క్రాంచిగా, టేస్టిగా ఉండే అటుకులను ఇష్టపడని వారు చాలా అరుదు. ఇక అటుకులతో చిటికెలో ఎటువంటి వంటకాన్ని అయినా చేసుకోవచ్చు. రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహోరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లూ ఎక్కువే. 


అటుకుల్ని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. అటుకులు డైటింగ్ చేస్తున్న వారికి దివ్యౌషధం. అటుకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే పిల్లలకీ, గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇవి చాలా మంచి ఆహారం. అటుకుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి సాయంత్రం సాక్స్‌ మాదిరి, ఉదయాన్నే టిఫిన్‌లోకి వండుకోవచ్చు. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగానూ అనిపిస్తుంది. ఫ్లేక్స్‌లోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.


అలాగే అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకూ ఇవి మంచివే. అటుకులలో ఉన్న యాంటీ ఆక్సీడెంట్స్ ఎన్నో వ్యాధులను అరికడతాయి. రాత్రివేళల్లో కూడా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలుపుతున్నారు. గుండె వ్యాధులతో బాధపడేవారికి కూడా ఇవి ఉత్తమ ఆహారం.


మరింత సమాచారం తెలుసుకోండి: