నాజూకైన నడుము ఉండాలి అని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. యోగాతో సులువుగా నాజూకైన నడుము దక్కుతుంది. యోగాలో నడుము సన్నబడేలా చేసే వ్యాయామాలున్నాయి. ఇక యోగాలో ఎలాంటి వ్యాయామాలున్నాయో తెలుసుకుందామా మరి..


ఈ 4 ఎక్సర్‌సైజెస్‌ను అనుసరిస్తే నాజూకైన నడుము దక్కుతుంది..  నిటారుగా నిలబడి రెండు కిలోల వెయిట్స్‌ చేతుల్లోకి తీసుకుని కుడి, ఎడమ వైపుకి శరీరాన్ని వంచాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి.  వెల్లకిలా పడుకుని కాళ్లను వంచి పైకి లేపాలి. పొట్టను లోపలికి పీల్చి చేతులు రెండు గాల్లోకి లేపి 20 అంకెలు లెక్కపెట్టి రిలాక్స్‌ అవ్వాలి.  ముందు చెప్పిన భంగిమలోనే ఉండి కాళ్లను, చేతుల్ని మడిచి బొమ్మలో చూపించినట్గు కుడి మోచేయి, ఎడమ మోకాలిని తాకేలా వంగాలి. ఇలా రెండోవైపు కూడా చేయాలి. ట్విస్టర్‌ మీద నిలబడి సాధ్యమైనంత మేరకు శరీరాన్ని అటూ, ఇటూ తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు శరీర కిందిభాగం మాత్రమే కదిలేలా చూసుకోవాలి. ఇలా 50 రిపిటీషన్స్‌ చేయాలి.


యోగాతో  చాల లాభాలు ఉన్నాయి. యోగా చేయడం వాళ్ళ   వెన్ను నొప్పి కూడా  మాయం అవుతుంది. వెన్ను నొప్పి నుంచి కూడా యోగా ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనలో కూడా వెల్లడైంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న సుమారు 1100 మంది స్త్రీ పురుషుల మీద అధ్యయనాలు చేసి వీరి చేత కొన్ని నెలల పాటు యోగాసనాలు వేయించారు.


ఇలా ఆసనాలు వేసిన వారిలో చాలా మందికి వెన్నునొప్పి తీవ్రత తగ్గడాన్ని  గుర్తించారు. అయితే కేవలం యోగా కారణంగానే వెన్నునొప్పి తగ్గదనీ, దాని నివారణకు మందులు తీసుకుంటూనే యోగాసనాలు వేస్తే మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చని వారు స్పష్టం కూడా చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: