సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యిని తరచూ వాడుతుంటారు. కొంద‌రికి వెన్న ఇంటే ఇష్టం ఉంటుంది. కొందరు నెయ్యిని ఆస‌క్తిగా తింటారు. కొంద‌రు వెన్న తింటే కొలస్ట్రాల పెరుగుతుందని తినటం మానేస్తు ఉంటారు. అయితే దేనినైనా లిమిట్‌తో  తింటే ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక వెన్నతో పెట్టిన విద్యలెన్నో తెలియదుకానీ, రోజుకో వెన్నముద్ద మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు ప‌రిశోధ‌కులు. మనదేశంలో పూర్వకాలం నుంచే పాల నుండి వెన్నను, వెన్న నుండి నెయ్యి, మీగడ తయారు చేయడం జరుగుతోంది.


వెన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎ, బి, సి, డి విటమిన్లు ఉన్నందున ఎదిగే పిల్లలకు వెన్న చక్కని పౌష్టికాహారంగా ప‌నిచేస్తుంది. వెన్నలో ఉండే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమై శ‌రీరానికి బలాన్ని ఇస్తుంది. వెన్న తిన‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోవ‌డంతో పాటు చ‌ర్మం మృదువుగా మారుతుంది. 100గ్రాముల వెన్నలో 750 కేలరీలు ఉంటాయి. వెన్నెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి పరోక్ష రక్షణ పొందవచ్చు.


అలాగే రోజూ వెన్న తినే వారిలో జలుబు, ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు చాలా అరుదు. వెన్నలో ఉండే యాంటీయాక్సిడెంట్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. మ‌రియు స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ సంతానోత్పత్తి పెంచడానికి వెన్న బాగా సహాయపడుతుంది. పెరుగుతున్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే వెన్న ఎక్కువగా తినాలి. అది వారిలో చురుకుదనం పెంచుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: