వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి.  మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. వేప ఆకు ఆరోగ్యానికే కాదు అందాన్ని రెట్టింపు చేయటంలో దీని పాత్ర కీలకం. వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. అయితే వేపచెట్టు కొమ్మల్లో, పువ్వుల్ల్లో ‘నింబోలిడ్’ అనే రసాయన మూలకం ఇమిడి ఉంది. వివిధ రకాల కేన్సర్ వ్యాధులను సమర్థంగా నివారించే శక్తి ‘నింబోలిడ్’కు ఉంది. 


అలాగే వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్‌ నివారిణి. వేపాకు రసంతో జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టవచ్చు. కురులు పెరగటానికి, బలంగా ఉండేందుకు వేపాకును ఆశ్రయిస్తే సరి. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. చర్మ సంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే చక్కటి ఔషధం వేప. మ‌రియు నొప్పులను నివారిస్తుంది. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప. 


సంప్రదాయంగా వేప ఆకులతో తయారు చేసే ఔషధాలు మలేరియా, మధుమేహం, గుండె జబ్బులకు ఉపయోగపడుతూ వచ్చాయి. గర్భనిరోధకంగా పనికొచ్చే అంశాలు కూడా వేపలో ఉన్నాయి. యాంటీ అల్సర్‌, యాంటీ ఫంగ్‌సగా ఉపయోగపడే మూలకాలు కూడా వేపలో ఉన్నాయి. ప్రతి రోజూ వేపాకును వాడుతూ ఉంటే, కేన్సర్‌ కణాలు బహుముఖంగా విస్తరించే అవకాశాలు తగ్గిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: