మధుమేహం.. ఒకసారి ఈ మధుమేహం వచ్చింది అంటే ఆహారం విషయంలో ఎన్నో కీలకమైన మార్పులు అవసరం. అప్పుడే మధుమేహం సమస్య దారిలోకి వస్తుంది. లేదంటే మధుమేహం సమస్య ఎక్కువ అవుతుంది. దీని వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారలు చాల ఉన్నాయి. 


ఆహార నియమాలు పాటించకపోతే జీవితాంతం మందులను వాడాల్సి వస్తుంది. ఆలా మందులు వాడటం మొదలు పెడితే మధుమేహానికి మించిన జబ్బులు వస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ మధుమేహం ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 


అధిక కేలరీలు, నూనెగింజలు, చక్కెర వంటివి తగ్గించి పీచు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.


మధుమేహుల భోజనంలో పండ్లు, కూరగాయల సలాడ్ తప్పనిసరిగా తీసుకోవాలి.


సులభంగా, నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అప్పుడే రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా, తక్కువగా విడుదల అవుతుంది.


అన్నం మానేయకుండా అందులో బొబ్బర్లు, శెనగలు, పెసల వంటి గింజలు వేసి వండుకొని తింటే మంచిది.


భోజనంలో పండ్లు తీసుకొనేవారు జామ, బొప్పాయి, పుచ్చ వంటివి తీసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: