సీతాకాలం రాగానే... సీతాఫలాలు పలకరిస్తాయి. ఎంతో రుచికరమైన ఈ ఫలాలు నిజంగానే మనకు దివ్యౌషధం అనుకోవచ్చు. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని ఓసారి తెలుసుకుందాం. మన అదృష్టం కొద్దీ సీతాఫలం చెట్లు ప్రతి చోటా ఉంటాయి. ప్రస్తుతం సీతాఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా వాటిని వదల్లేరు. సీతాఫలంలో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో విటమిన్లు ఉన్నాయి. 


సీతాఫలంలో మన బాడీలోని విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడుతాయి. అందువల్లే సీతాఫలాలకు అంతలా డిమాండ్ పెరిగిపోయింది. బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలోని విటమిన్ A... మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే... జీర్ణక్రియ బాగా అవుతుంది.


 ఈ సీతాఫలంలోని కాపర్... మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది. సీతాఫలంలోని మెగ్నీషియం... మన బాడీలోని వాటర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. కీళ్లలోని యాసిడ్స్‌ని బయటకు తరిమేసి... రుమాటిజం, కీళ్లనొప్పులకు చెక్ పెడుతుంది. మీకు నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే సీతాఫలం తినండి. ఇందులోని పొటాషియం... మీ కండరాల బలహీనతను తగ్గించి... మీకు శక్తిని ఇస్తుంది. 


ఆస్తమాతో బాధపడేవారు కస్టర్డ్ యాపిల్ (సీతాఫలం) తింటే మేలు జరుగుతుంది. ఇందులోని విటమిన్ B6... ఆస్తమాకి చెక్ పెడుతుంది. గర్భిణీలు కూడా తప్పక తినదగ్గ పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించే గుణం ఈ పండుకి ఉంది. అందువల్ల రేటు ఎక్కువైనా ఈ సీజన్‌లో సీతాఫలాలు కొనుక్కుని తింటే మనకు చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: