కావాల్సిన ప‌దార్థాలు: 
చేపలు- పావుకిలో
పచ్చిమిరపకాయలు- 2
ఉప్పు- తగినంత


నూనె- సరిపడా
మొక్కజొన్నపిండి- ఒక కప్పు
కారం- రెండు టీ స్పూన్లు


తయారీ విధానం: 
ముందుగా చేప‌లు క్లీన్ చేసుకోవాలి. ఇప్ప‌డు చేప ముక్కల్లోంచి ముల్లులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేయాలి. అందులో మొక్కజొన్నపిండి, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. 


ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఈ పిండిని చిన్న చిన్న పకోడీల్లా వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే క్రిస్పీ క్రిస్పీ `ఫిష్ ప‌కోడి రెడీ అయిన‌ట్టే.. ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడుకు మేలు చేసేవి చేపలు. చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం చాలా మంచిది.


అలాగే చేప‌ల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. చేప‌లు తిన‌డం వ‌ల్ల మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు పొందొచ్చు. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. అయితే చేప‌ల క‌ర్రీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా చేప‌ల ప‌కోడిని ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: