ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. అయితే ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. 


కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది ఆయుష్షును క్షీణింప చేస్తుందని గతంలో జరిపిన పరిశోధనలు కూడా వెల్లడి చేశాయి. అయితే నిత్య జీవితంలో కేవలం ఇల్లు, ఆఫీసు, కాలేజీయే కాదు.. వినోదానికీ పెద్ద పీట వేయాలి. ఒత్తిడిని తగ్గించే బ్రహ్మాస్త్రం వినోదం. అందులో మునిగి తేలితే ఒత్తిడి మీ దరి చేరదు. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.


పాలు, బాదం పప్పు, నారింజ పండ్లు, పాలకూర, చేపలు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉంటే ఒత్తిడి దరిచేరదు. వీటిల్లో ఉండే పోషకాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. అదే విధంగా స్విమ్మింగ్ చేయడం, ఇష్టమైన క్రీడలు ఆడడం, పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, యోగా వల్ల కూడా ఒత్తిడి బారి నుంచి బయట పడవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: