ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, నివారణ చర్యలను గురించి తెలుసుకుందామా మరి.. పిల్లల్లో స్థూలకాయం వల్ల వస్తుంది. పిల్లల్లో స్థూలకాయం క్రమక్రమంగా ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతోంది. రోజువారీ ఆహార పానీయాలతో పాటు పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీములు, కార్బోనేటెఢ్‌ డ్రింక్స్‌, జంక్‌ఫుడ్స్‌ వంటివి అతిగా తినడం వల్ల కూడా పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయం ఏర్పడతాయి. దీనివల్ల పిల్లల్లోనూ, అధికరక్తపోటు,, టైప్‌-2 మధుమేహం, ఫ్యాటీ లివర్‌ వంటి వ్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.


ఇక స్థూలకాయం వల్ల వచ్చే సమస్యలు చూద్దామా మరి..స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, ట్రైగ్లిజరైడ్లు, రక్తంలో ఎల్‌.డి.ఎల్‌ నిల్వలు పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గుండెపోటు, పక్షవాతంతో పాటు మెటబాలిక్‌ సిండ్రోమ్‌, స్లీప్‌ అప్నియా, ఆస్ట్రియో ఆర్థరైటిస్‌ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. స్థూలకాయం ఎక్కువ కాలం కొనసాగితే, లైంగిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని కుటుంబాల్లో స్థూలకాయం, వారసత్వంగా కూడా వస్తూ ఉంటుంది. దీనికి కారణం జన్యువులే కాదు, కుటుంబ సభ్యులంతా తీసుకునే ఒకే తరహా ఆహారం కూడా అందుకు కారణమే!


హైపోథైరాయిడిజం, ప్రీడర్‌, విల్లో సిండ్రోమ్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్స్‌ లాంటివి కూడా శరీర బరువు పెరిగేలా చేస్తాయి. మానసిక కుంగుబాటు, ఫిట్స్‌, మధుమేహం, మానసిక రుగ్మతలకు వాడే మందులు, ఇంకొందరిలో బీటాబ్లాకర్లు, స్టిరాయిడ్‌ ఔషధాలు కూడా స్థూలకాయానికి కారణమవుతూ ఉంటాయి. హార్మోన్లలో వచ్చే మార్పు కూడా కొందరిని స్థూలకాయులుగా మార్చేస్తుంది.


స్థూలకాయం ఒక దశ దాటితే బేరియాట్రిక్‌, ల్యాప్రోస్కోపిక్‌ వంటి సర్జరీలే తప్ప మరో మార్గం ఉండదు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే స్థూలకాయం రాకుండా నివారణ చర్యలను చేపట్టడమే ఉత్తమం. ముందు జాగ్రత్తగా సంబంధిత కారణాలు తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: