సాధార‌ణంగా సీతాఫ‌లం తెలియ‌ని వారుండ‌రు. ప్రస్తుతం మార్కెట్‌లో సీతాఫలాలు విరివిగా దొరుకుతున్నాయి.ఎందుకంటే ఈ సీజ‌న్‌లో మ‌న‌కు సీతాఫ‌లం ఎక్కువ‌గా దొరుకుతాయి. ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తింటుంటారు. సీతాఫలంలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. పోషక విలువల పరంగా చూస్తే ఈ పండులో ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా లభిస్తాయి. పండు తిన్న వెంటనే శక్తి లభిస్తుంది.


అయితే సీతాఫ‌లాన్ని పిల్ల‌ల‌కు పెట్ట‌డం వ‌ల్ల దీనిలో ఉండే ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. పిల్ల‌ల ఆరోగ్యానికి, ఎదుగుద‌ల‌కు సీతాఫ‌లం చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే . బలహీనంగా ఉన్నపిల్లలకు, బాలింతలకు సీతాఫలం గుజ్జను తేనెతో కలిపి ఇస్తే అది వాళ్లకు అధిక శక్తి చేకూరడానికి ఉపకరిస్తుంది. 


సీతాఫలాల గుజ్జును జ్యూస్ లా చేసి పటికి బెల్లం లేదా చక్కెర వేసి పాలతో కలిపి ఇస్తే పాలిచ్చే తల్లులకు, ఎదిగే పిల్లలకు మంచి ఆహారం. అదే విధంగా. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: