సాధారణంగా సగటున ఒక మనిషికి రోజులో 50 నుండి 70 వెంట్రుకలు ఊడిపోవడం సహజం. తిరిగి స్థానంలో మళ్ళీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇదంతా ప్రతిమనిషి శరీరంలో జరిగే అతి సహజమైన ప్రక్రియ. అయితే వెంత్రుకలు ఎక్కువగా ఊడటం వల్ల బట్టతల వస్తుంది. ఇక మనకు రోజు బట్టతల ఉన్న వ్యక్తులు ఎంతో మంది కనిపిస్తుంటారు.. అసలు ఎప్పుడైన ఈ బట్ట తల ఎందుకు వస్తుందో ఆలోచించారా..


మానవ శరీరంలో జరిగే ప్రక్రియలో భాగంగా ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాకపోతే అది బట్టతలగా మారిపోతుంది. దానికి చాలానే కారణాలు ఉండొచ్చు. అయితే ఎంతోమంది వారి జుట్టును కాపాడుకోవడానికి రకరకాల షాంపులు, నూనెలు, హెయిర్ క్రీములు లాంటివి వాడుతూ ఉంటారు. అయితే జుట్టు రాలడం అనే సమస్య కేవలం వాడే షాంపూల మీదనే కాక తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేమంటే శరీరంలో ఐరన్‌ లోపించడమే జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణమట. కాబట్టి ప్రతిరోజు ఐరన్ ఎక్కువగా ఉన్నా మాంసాహారం, ఆకుకూరలు, బెల్లం లాంటివి తీసుకోవాలని వైద్యులు చెప్పుకొస్తున్నారు.


ప్రస్తుత రోజుల్లో ఎక్కువమందిలో తగినంత ఐరన్‌ ఉన్న ఆహారం తీసుకోక పోవడం వలనే జుట్టు రాలడం అనే సమస్యలతో సతమతమౌతున్నారని పరిశోధనలో తేలింది. అయితే శాఖాహారం కంటే మాంసాహారంలో ఎక్కువ ఐరన్ ఉంటుందట కాబట్టి జుట్టు రాలడం సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్లు చికెన్, మటన్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెప్పుకొస్తున్నారు. దీనిపై అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ డెర్మటాలజీకి చెందిన లియోనిడ్‌ బెంజమిన్‌ ట్రోస్ట్‌ 40 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా శరీరంలో ఐరన్‌ లోపాన్ని అధిగమించిన తర్వాతే జుట్టు రాలే సమస్యకు చికిత్స ప్రారంభించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలరంటూ తెలియజేసారు.


అలాగే అమెరికన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కూడా ఈ విషయాలపై ఒక నివేదిక ప్రకటించింది. అందులో ప్రతిరోజు మహిళలకైతే 18 మిల్లీగ్రాములు, పురుషులకు 8 మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం. ఈ శాతం కంటే తక్కువ తీసుకుంటే జుట్టు రాలుతుందని, వీటితో పాటు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఇకపోతే ఐరన్‌ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందట అవి హీమ్‌ ఐరన్‌, నాన్‌ హీమ్‌ ఐరన్‌. ఈ రెండు  శరీరానికి అవసరమని ట్రోస్ట్‌ తెలిపారు.


శాకాహారంలో కేవలం నాన్‌ హీమ్‌ ఐరన్‌ మాత్రమే ఉంటుందని, హీమ్‌ ఐరన్‌ చాలా కొద్ది మొత్తంలో ఉంటుందని తెలిపారు. ఒకవేళ మీరు శాకాహారి అయితే పుల్లగా ఉండే పండ్లు ఎక్కువగా తినాలట, ఇంకా ఆకుకూరల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందట. ఇవన్నీ కాకుండా ఐరన్‌ కోసం టాబ్లెట్స్‌ వాడాల్సి వస్తే డాక్టర్‌ సలహాతో వాడాలంటూ వైద్యులు సూచిస్తున్నారు... 


మరింత సమాచారం తెలుసుకోండి: