అసలు డెంగ్యూ రావడానికి ముఖ్య కారణం ఏడెస్ అనే దోమ. ఈ ఏడెస్ దోమ రక్తంలో డెంగ్యూ వైరస్ ఉండి ఎవరినేనా కుడితే వారికీ డెంగ్యూ జ్వరం వస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా డెంగ్యూ వచ్చినట్లైతే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న దోమలు వ్యాధిని చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చేస్తాయి. తాజాగా మన తెలుగు రాష్టంలో ఒకే కుటుంబానికి చెందిన వారంతా డెంగ్యూ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. దోమల సంఖ్య తీవ్రంగా పెరిగిపోవడం వలన చాలా మంది ఈ వ్యాధికి గురిఅవుతున్నారు. 


దురదృష్టం ఏంటంటే డెంగ్యూ బారిన పడిన బాధితులో జ్వరం వచ్చినట్లు ఏ లక్షణాలు కనిపించవు. ఈ కారణం వలన చాలా మంది డెంగ్యూ బాధితులు వారికి ఆ వ్యాధి వచ్చిందని తెలిసేలోపు మృతువొడికి చేరుకున్నారు.


అసలు డెంగ్యూ బారిన పడే వారిలో చిన్నపిల్లలు, మధుమేహ గ్రస్తులు, వయసు పైపడ్డవారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీనికారణంగా, వీరు ఎక్కువగా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. 


డెంగ్యూ జ్వరం నిరోధించడానికి తీసుకోవలసిన తగు జాగ్రత్తలు:
• దోమల వలనే చాలా ప్రాణాంతకమైన ఫీవర్లు వస్తాయి. అందుకే ముందుగా మీరు నివసిస్తున్న ప్రదేశంలో దోమలను నియంత్రించాలి. మీ ఇంటి చుట్టూ ఏ వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. 


• రాత్రి సమయాలలో దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు తలుపులు మూసి ఉంచాలి. 


• పొడుగుగా ఉన్న దుస్తులను ధరించాలి. పడుకొనే సమయంలో కాళ్ళను చేతులను పూర్తిగా కప్పుకోవాలి.


నీటి ద్వారానే ఎక్కువగా రోగాలు వస్తాయి. అందుకే తాగే నీటిని ఫిల్టర్ చేసుకోవాలి, వీలైతే నీటిని కాల్చి చలార్చి తాగాలి. ఇంటి మూలలను రోజు శుభ్రపరుచుకోవాలి.  బయట ఫుడ్ శుభ్రతలేకుండా చేస్తుంటారు కాబట్టి అవి తినకపోవడమే మంచిది. 


ఈ రోజుల్లో డెంగ్యూ అనేది తెలుగు రాష్ట్రాలు ఎదుర్కుంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య. నిర్లక్ష్యం చేయకుండా, మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతేనా ముఖ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: