రోజూ ఉదయాన్నే చాలా మంది టీ లేదా కాఫీతో దినచర్య మొదలుపెడతారు. టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ పరగడుపున తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అల్సర్, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారికి కొద్ది రోజులలోనే మజ్జిగ తాగితే ఆ సమస్యలు దూరమవుతాయి. మజ్జిగలో జీలకర్ర, ఇంగువ, సైంధవ లవణం కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. మజ్జిగ ఎక్కువగా తాగేవారికి పైల్స్ సమస్యలు రావు. 
 
మజ్జిగలో శుద్ధి చేసిన గంధకాన్ని కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. నెయ్యి, వేరుశెనగతో కూడిన ఆహారాలు తీసుకున్నపుడు ఎలర్జీ వస్తే మజ్జిగకు కొంచెం పసుపు కలిపి తీసుకోవాలి. మజ్జిగ అజీర్తి, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. మజ్జిగలో అర టీ స్పూన్ మిరియాల పొడి, రెండు మూడు కరివేపాకులు కలిపి తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవటంతో పాటు కొవ్వు కూడా కరుగుతుంది. 
 
వేడి వాతావరణంలో ఎక్కువగా పనిచేసే వారు పరగడుపున మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేయించిన జీలకర్రను మజ్జిగలో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకుంటే నులిపురుగుల సమస్య తీరుతుంది. పొడిచర్మం ఉన్నవారు మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది. ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తీసుకుంటే హైబీపీ ఉన్నవారికి ఎంతో మంచిది. ఎసైటిస్, హెపటోమెగాలి, ఉబ్బసం దగ్గు, బ్రాంకైటిన్, నిమోనియా వ్యాధులకు మజ్జిగను వాడటం మంచిది కాదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: