తల్లి అనిపించుకున్నప్పుడే ఆడజన్మకు సార్థకత. అమ్మతనం కోసం ప్రతి స్త్రీ తపిస్తుంది, తపస్సు చేస్తుంది. అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారం నుంచి చేసే అనేక పనులు మనతో పాటు గర్భంలో ఉన్న శిశువు మీద కుడా ప్రభావం  చూపిస్తాయి. 


ఈ పరిస్థితులలో గర్భంతో ఉన్న వాళ్ళు  చేసే ప్రతి పని, రెండు ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. కడుపుతో ఉన్నపుడు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. పిల్లి, కుక్క, పక్షులు లేదా ఇతర జంతువులు అనేక రకమైన వైరస్,బాక్టీరియా లను కలిగివుంటాయి. సో.. వీటికి దగ్గరగా ఉన్న సమయములో అవి మనకు వ్యాపించే ప్రమాదం ఉంది. బరువులు ఎత్తడం, మోయడం లాంటి విషయాలకు ఎంత దూరంగా వుంటే అంత మంచిది.


అదే విధంగా గర్భం దాల్చిన సమయములో దూరంగా ఉండాల్సిన విషయాలలో మద్యం,ధూమ‌పానం అత్యంత ప్రమాదకరమైనది. మద్యం మ‌రియు ధూమ‌పానం తల్లితో పాటు పుట్టపోయే శిశువుకి కూడా అనారోగ్య కలుగుతుంది. కడుపుతో ఉన్నప్పుడు జరిగే శారీరక, మానసిక మార్పులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయ్ . దీని వలన కలిగే పరిణామాలు తల్లితో పాటు శిశివుని కూడా  బాధిస్తాయి. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఏదైనా వ్యాపకం అలవాటు చేసుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: