ప్రపంచంలో ప్రతి 20 వేల మంది చిన్నారుల్లో ఒకరికి అకోన్‌డ్రాప్లాసియా అనే జన్యు సమస్య వస్తుందని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు అదే సమస్యతో బిడ్డ పుట్టడంతో కోర్టుని ఆశ్రయుంచింది ఒక యువతి. ఎంతో ఆశతో అందమైన మగ బిడ్డ కోసం  ఆరు అడుగుల అందగాడి వీర్యంతో కృత్రిమ గర్భధారణతో  బిడ్డకు జన్మనివ్వాలనుకున్నమహిళకు ఆశలు అడి ఆశలు అయ్యాయి. మరుగుజ్జు కొడుకు పుట్టడంతో షాకైన సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. 


వీర్య దాతల వివరాలను అందించించి స్మెర్మ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేసు వేసింది. రష్యా రాజధాని మాస్కోకు చెందిన 40 ఏళ్ళ మహిళ కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్ ట్రీట్మెంట్) ద్వారా పిల్లాడిని కనాలని ఓ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళింది.గర్భ ధారణ కోసం వీర్య దాతను ఎంచుకోవాలంటూ సంతాన సాఫల్య కేంద్రం నిర్వహకులు సూచించారు. అందుకోసం అంతర్జాతీయ స్పెర్మ్ బ్యాంకు నుంచి సేకరించిన కొందరి వీర్య దాతల ఫోటోలను ఆమెకు చూపించారు. 


తనకు పుట్టబోయే కొడుకు ఆరు అడుగుల ఎత్తు, అందం ఉండాలని భావించిన మహిళ ఎత్తుండే వీర్యదాతను ఎంచుకుంది. అతడి వీర్యంతో కృత్రిమ పద్ధతుల ద్వారా ఆమె గర్భం దాల్చించి. తొమ్మిది నెలల తరువాత మగ బిడ్డ ప్రసవించింది. బిడ్డ పుట్టిన ఆనందం ఆమెకు ఎక్కువ సేపు నిలవలేదు.
పుట్టిన బిడ్డ అకోన్‌డ్రాప్లాసియా అనే జన్యు సమస్య బాధపడుతుండటమే ఇందుకు కారణం.  ఈ సమస్యతో బాధపడేవారు మరుగుజ్జు అవుతారని డాక్టర్లు ఆమెకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయింది.  ప్రపంచంలో ప్రతి 20 వేల మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుందని డాక్టర్లు తెలిపారు.

 స్పెర్మ్ బ్యాంక్ నిర్మహకులే తన ఈ పరిస్థితికి కారణమని భావించి వారిపై కోర్టులో దావా వేసింది. ఈ కేసును విచారించిన కోర్టు ఆ స్పెర్మ్ బ్యాంక్‌‌ను మూసివేయాలని ఆదేశించింది.  ఆ సంస్థ సేవలు రష్యా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ సమస్య తగిన వివరణ ఇవ్వడంలోనూ ఆ సంస్థ నిర్లక్ష్యం కనబరిచింది. తాము నాణ్యమైన వీర్యాన్నే సరఫరా చేశామని, ఆమెకు ఐవీఎఫ్ చేసిన క్లీనిక్‌లో తప్పిదం జరిగితే తాము బాధ్యులం కాదని తెలిపింది. కాగా, బాధితురాలి అభ్యర్ధన మేరకు పోలీసులు ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: