ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు డయాబెటిస్‌ వ్యాధితో చాల బాధ పడుతున్నారు. ఇప్పుడు సోంపు గింజతో  డయాబెటిస్‌ వ్యాధిని ఎలా తగ్గించు కోవాలో చూద్దామా మరి.. సోంపు గింజల్లో యాంటీఆక్సిడెంట్స్‌తోపాటూ... చాలా పోషకాలున్నాయి. అవి... టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి... విటమిన్ సీ, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.


 అలాగే సోంపు గింజలో క్లోరోజెనిక్ యాసిడ్, లైమొనెన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ డయాబెటిస్, కాన్సర్, గుండె జబ్బులు రాకుండా వైరస్, బ్యాక్టీరియాతో పోరాడతాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు... రోజుకు రెండుసార్లు విటమిన్ సి టాబ్లెట్లు వేసుకుంటూ ఉండడం సాధారణం. అలాంటి వారు సోంపు గింజల్ని తింటే... విటమిన్ సీ లభించి... టైప్ 2 డయాబెటిస్ లెవెల్స్ తగ్గే అవకాశాలుంటాయని ఆస్ట్రేలియాలో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడింది. 


బంగ్లాదేశ్‌లో ఎలుకలకు పుదీనా, సోంపు గింజల్ని తినిపించారు. ఫలితంగా వాటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్... కొంతవరకూ తగ్గాయి. మందులు వాడటం కంటే ఇది మంచిదంటున్నారు పరిశోధకులు. సోంపు గింజల్లోని ఫైబర్... బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తూ... టైప్ 2 డయాబెటిస్ పెరగకుండా చేయగలుగుతోంది. సోంపులో కాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. 


సోంపు గింజల్ని డైరెక్టుగా తినడం గానీ లేదా... సూపులు, ఇతర వంటల్లో వేసుకొని తినడం గానీ చెయ్యాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సోంపు గింజల్ని రోజూ కొద్దిమొత్తంలోనే తీసుకోవాలనీ, అధికంగా తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలాగే... ప్రెగ్నెన్సీ ఉన్నవారు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు... సోంపు గింజల్ని తినవద్దని వైద్యలు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: