భార్య భర్తల బంధం మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా అన్యోనంగా జీవిచాలంటే ఉండాల్సింది నమ్మకం, ప్రేమ, స్నేహం మాత్రమే కాదు వాటన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది శృంగారం. ఆలూమగలు మధ్య శృంగారం సమస్యలు ఏ ఒక్కరికీ వచ్చినా చాలు వాళ్ళ బంధం మూడు ముక్కలవుతుంది. అందుకే వివాహ దాంపత్యంలో సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించడం తప్పనిసరి.


మీలో ఎవరేనా శృంగార సామర్థ్యం తగ్గినట్లు గమనిస్తే మొదటిగా మీరు రోజు తినే ఆహారం పై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆహరం మన శృంగార సామర్థ్యం పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీరు కింద పేర్కొన్న ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నట్లైతే వెంటనే ఆపేయండి.. ఇపుడు అవేంటో చూద్దాం... 


1. ఫ్రై ఫుడ్స్/ వేయించిన ఆహారాలు 

మీరు కాకరకాయ ఆలూ ఇంకా ఇతర కూరగాయల వేపుడ్లు తినడమంటే ఇష్టమా? మీ సమాధానం 'అవును' అయితే మీకు ఈ ఇష్టమైన ఫుడ్స్ ఎంత కష్టమైన తినడం మానేయాల్సిందే. ఎందుకంటే, ఫ్రైడ్ ఫుడ్స్ లో ఎక్కువగా ట్రాన్స్ ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. అవి మీలోని మీ శృంగార భాగ్యస్వామిలోని సెక్సువల్ సామర్ధ్యాన్ని బాగా తగ్గిస్తాయి. 


2. సోయా గింజలు 
నిజం చెప్పాలంటే... సోయా గింజలలో ఉన్న పోషకాలు మరేతర శాకాహార ఫుడ్స్ లలో లభించవు. కానీ అతిగా ఈ సోయా గింజలను తింటే మీలోని కామ కోరికలను పూర్తిగా కుదించేస్తాయి. ఈ సోయా గింజలు మగవారి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. 


3. ధనియాలు, సోపు విత్తనాలు
ధనియాలు ఆ సామర్ధ్యాన్ని తాగిస్తాయని మీరు అసలు ఊహించలేదు కదా? కానీ ఇది చేదైన నిజం. మసాలా దినుసులలో ప్రధానంగా వాడే ఈ ధనియాలు టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గించేస్తుంది. ఇక మనకి ఇష్టమైన సోపు విత్తనాలును భోజనం తర్వాత తినడం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. కానీ ఇవి అతిగా తిన్నట్లైతే మీలో సెక్స్ సామర్థ్యం సూన్యమైపోతుంది. 


వీటితో పాటు రెడ్ మీట్, ఆల్కహాల్, సుగరీ డ్రింక్స్ అంటే తంసప్, స్ప్రైట్ లాంటివి ఎక్కువగా స్వీకరిస్తున్నట్లైతే అవి మీ శృంగార జీవితాన్ని నాశనం చేస్తాయి. మంచి ఆహార అలవాట్లతో పాటు రోజు వ్యాయామం చేయడం ద్వారా అన్ని ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టి సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: