విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందం, ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఎ శక్తివంతమైన ఆంటాక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అయితే విటమిన్ ఎ  లోపిస్తే కంటి చూపు సరిగ్గా ఉండదని అందరికీ తెలిసిందే. 


అలాగే విటమిన్ ఎ లోపం వల్ల ఇదే కాదు, ఇంకా పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. విటమిన్ ఎ కొవ్వులో కరిగే విటమిన్. శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే ఎముకలు సరిగ్గా పెరగవు. అవి బలహీనంగా మారుతాయి. మ‌రియు మూత్రాశయం ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. ముఖ్యంగా  గర్భంతో ఉన్న స్త్రీలు విటమిన్ ఎ సరిగ్గా తీసుకోకపోతే వారి పిల్లలకు రేచీకటి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.


అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను అదిగ‌మించ‌డానికి స‌రైన ఆహారం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. సో.. దీని కోసం విట‌మిన్ ఎ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యారెట్లు, మామిడి పండ్లు, బొప్పాయి పండ్లు, చేపలు, చిలగడ దుంపలు, పాలకూర, యాప్రికాట్స్, బ్రొకొలి, కోడిగుడ్లు, పాలు, పాల సంబంధ ఉత్పత్తులు, యాపిల్ పండ్లు, టమాటాలు, ఎరుపు రంగు క్యాప్సికం, బాదం పప్పు, ఖర్బూజా, క్యాబేజీ, మటన్, ఉల్లిపాయలు, చిక్కుడు జాతి గింజలు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: