డైటింగ్ చేసే వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్!. రండి..ఓ కొత్త డైటింగ్ మీకు పరిచయం చేస్తాను. డిటాక్స్‌ డైటింగ్ తో శరీరంలో మలినాలను తొలగించేందుకు ప్రత్యేక డైట్‌ ఆరోగ్యం కోసం ఆహారం. "డిటాక్స్‌" ఆచరిస్తే మంచి ఫలితాలుఉరుకుల పరుగుల ఈ యాంత్రిక జీవితంలో వారంలో ఒక్క రోజైన విశ్రాంతి దొరికితే బాగుండని అనుకోవడం సహజం. శరీరం నూతనోత్తేజం పొంది మళ్లీ దైనందిన జీవితంలోకి రావడానికి ఈ ఒక్కరోజు ఉపయోగపడుతుంది.  మన జీర్ణవ్యవస్థ కూడా అలాగే అనుకుంటుంది. సరిగ్గా మన ఆహారం విషయం కూడా ఇలానే ఉంటుంది.


వారం అంతా ఏం తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో తెలియని పరిస్థితి.  వారం మొత్తం తిన్న ఆహారం వల్ల పేరుకుపోయిన మలినాలను ఒక రోజు వాటిని తొలగించే విధంగా ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం.  అది కూడా మందులు, ఆకు పసరులతో మాత్రం కాదు. ఆహారంతో ఏర్పడిన మలినాలను, ఆహారంతోనే తొలగించవచ్చు.  దీనినే డిటాక్స్‌ డైట్‌ అంటారు. 


 గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అవడంతో శరీరం మొత్తం మలినాలతో నిండిపోయి ఉంటుంది.  దీంతో శరీరంలో అవయవాల పనితీరు కూడా పూర్తిగా మారిపోతుంది.  ఈ మలినాలను తొలగించే పద్ధతిని డిటాక్సిఫికేషన్‌ అంటారు.  ఆహారం ద్వారా మలినాలను తొలగించడాన్ని డిటాక్స్‌ డైట్‌ అంటారు.  డిటాక్స్‌ డైట్‌ అంటే వారంలో ఆరురోజులు పాటు తీసుకునే ఆహారానికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.  అంటే 24 గంటలపాటు ఈ డైట్‌ ను పూర్తిగా పాటించాలి.  ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండటమే.


ఈ డైట్‌లో ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రధాన ఆహరం బార్లీ, సబ్జా నీళ్లు, నిమ్మరసం, 8 నుంచి 10 గ్లాసుల నీరు.  వీటితోపాటు పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు కూడా తీసుకోవచ్చు. అంతేకాక ఉప్పుని తిననివారు ఆ ఒక్క రోజు ఆహారంలో ఉప్పు ఉండేలా చూసుకోవాలని కూడా ఈ డైట్‌ చెబుతుంది.  ఉప్పు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో సోడియం తగ్గి మలినాలు చేరతాయని డైటీషియన్లు చెబుతున్నారు. శరీరంలో మలినాలు యూరిన్ ద్వారా బయటకు పంపడానికి ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉపయోగపడతాయి.  ఈ డైట్‌ పాటించే రోజు తీపి పదార్ధాలు, బేకరి ఫుడ్‌కు  కచ్చితంగా దూరంగా  ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: