గుడ్డు తింటే ఆరోగ్యం ఉంటుంది.. ఆ విషయాన్నీ అందరు అంటారు. వైద్యులు మరి మరి చెప్తారు రోజుకో గుడ్డు తినమని. అలాంటిది ఇక్కడ గుడ్డు తినడవల్ల ప్రాణం పోయిందంట.. నిజమండి గుడ్డు తింటూ ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుభాష్ అనే వ్యక్తి గుడ్డు తింటూ గుండె పోతూ రావడంతో మరణించాడు. 


మ్యాటర్లోకి వెళితే.. సుభాష్ తన ఫ్రెండ్ తో కలిసి సరదాగా మార్కెట్ కు వెళ్లారు. అక్కడ గుడ్డు విషయంలో కొద్దిగా వాగ్వాదం చోటుచేసుకుంది. దానివల్ల క్లోజ్ ఫ్రెండ్స్ కాస్త కయ్యానికి దిగారు. ఇదంతకాదు నువ్వా నేనా అని పోటీ పెట్టుకున్నారు. ఆప్త మిత్రులు గా ఉన్న వాళ్ళు అంతలోనే శత్రువులు అయ్యారు. అయితే సుభాష్ ఫ్రెండ్ వేసిన పందెం నచ్చడంతో ఓకే అనుకున్నారు. 


అసలు మ్యాటర్లోకి వెళితే... ఎవరైతే ఎక్కువ గుడ్లు తింటే వారికి 2000 ఇస్తానని పందెం వేసాడు. దానితో పందెం ఒప్పుకున్నాడు సుభాష్. ఇప్పుడు దానికోసం అయన 50 గుడ్లు తినాల్సి ఉంది. 41 గుడ్డు తిన్నాడు. 42 వ గుడ్లు తింటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఫ్రెండ్ వెంటనే అతనిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. 


దాదాపుగా సుబాష్ గంట సేపు వరకు ప్రాణాలతో పోరాడి చనిపోయారు. గుడ్లు ఎక్కువగా తినడం వల్లనే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించారు. అందుకే గుడ్డు రోజుకు ఒకటి మంచిదే కానీ రోజులో మొత్తం తినడంవల్ల గుండెకు రక్తాన్ని అందించే నాళాల్లో అడ్డుకొని రక్తాన్ని ఆపడం వల్ల  రక్తప్రసరణ ఆగిపోవడం వల్లనే ప్రాణాలు పోతాయి. జాత్రత్త సుమీ ప్రాణాలు పోగొట్టుకోకండి. ఒక్క గుడ్డు మాత్రమే తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: