చాలామంది ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో అన్నం కంటే చపాతీలను ఎక్కువగా తింటున్నారు. శరీర బరువును తగ్గించుకోవటం కొరకు ఎక్కువ మంది చపాతీలను తింటున్నారు. యువత ఈ మధ్య కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కాలుష్యం వలన సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే బరువు పెరుగుతున్నారు. 
 
ప్రస్తుతం యువతలో స్థూలకాలం సాధారణ సమస్యగా మారిపోయింది. డాక్టర్లు కూడా బరువు తగ్గటానికి రాత్రి సమయంలో చపాతీలను తినమని సూచిస్తున్నారు. కానీ నిపుణులు, డాక్టర్లు రాత్రి పూట వేడి వేడి చపాతీలు కాకుండా నిల్వ ఉన్న చపాతీలు తింటే మంచిదని చెబుతున్నారు. సాధారణంగా ఆహార పదార్థాలు వండిన  12 గంటల సమయం తరువాత ఆ ఆహార పదార్థాలలోని పోషక విలువలు అంతమైపోతాయి. 
 
కానీ చపాతీలు, రోటీలు మాత్రం వేడివేడివి తినటం కంటే కనీసం 12 గంటల సమయం నిల్వ ఉంచి తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా రాత్రి సమయంలో చపాతీలను చేసుకుంటే మిగిలిన చపాతీలను ఉదయం సమయంలో తింటే ఆ చపాతీల వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. షుగర్ వ్యాధితో బాధ పడే వారు నిల్వ చేసిన చపాతీలను తినటం ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. 
 
నిల్వ చేసిన చపాతీలను తినటం వలన గ్యాస్, అల్సర్స్, బ్లడ్ ప్రెషర్ లాంటి రోగాలు కూడా నయమవుతాయని తెలుస్తోంది. నిల్వ ఉన్న చపాతీలను తినటం ద్వారా రక్తహీనత సమస్యలు కూడా దూరమవుతాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: