ఆల్కాహాల్ అనేది ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అతిగా  మద్యం తాగడం వల్ల ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆల్కాహాల్ తాగడం వల్ల మనిషిని ప్రభావితం చేసే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా మరి..


1.మద్యపానం శరీరంలో జరిగే ఇతర పనులను జరగకుండా చేస్తుంది. మీరు మద్యం తీసుకున్న తర్వాత, మీ శరీరంలోని జీవక్రియను అది మార్చేందుకు తోడ్పడుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుల మాదిరిగా కాకుండా మీ శరీరంలో ఆల్కహాల్ నిల్వ ఉండే అవకాశం లేదు కాబట్టి అది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. 

2.ఆల్కహాల్ గట్‌లో బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. అది చివరికి పేగు గోడ గుండా కాలేయంలోకి వెళ్లి కాలేయాన్ని దెబ్బతీస్తుంది. 

3. మద్యం సేవించడం హృదయానికి చాలా హానికరమైన పని. ఇది గుండె బలహీనంగా మారడానికి కారణమవుతుంది. అధిక రక్తపోటు వచ్చేలా చేస్తుంది.

4.మద్యం అలవాటు నరాల బలహీనతకు కారణమవుతుంది. కండరాలు పటుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.

5.ఎక్కువగా తాగడం వల్ల నోటి క్యాన్సర్, అన్నవాహిక, గొంతు, కాలేయం మరియు రొమ్ము వంటి కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

6.ఆల్కాహాల్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ తాగితే జలుబు, ఫ్లూ లేదా ఇతర అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఆల్కాహాల్ అనేది శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు సహకరిస్తుంది.

  ఇంకా ఎన్నో అనర్థాలు ఆల్కాహాల్ ను సేవించడం వల్ల కలుగుతాయి. మద్యపానం హానికరం. అది మీకు మీ కుటుంబసబ్యులకు కూడా బాధాకరం చేస్తుంది. కాబట్టి మద్యం తాగకండి.. తాగనీయకండి. వీలైనంతవరకు ఆల్కహాల్కు చాలా దూరంగా ఉండండి. మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వలన మీ ఆరోగ్యానికి చాలా హానికరం.


మరింత సమాచారం తెలుసుకోండి: