సాధార‌ణంగా జామ పండు అంద‌రికి తెలిసిన‌వి, అందరికి కూడా  అందుబాటులో ఉండేవి. జామ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు లభిస్తాయో అందరికి తెలిసిందే కదా.  వీటిల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే ఒక మంచి దివ్య ఔషదం. అయితే జామకాయ‌లు మాత్ర‌మే కాదు జామ ఆకులో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అంటే నమ్మండి.


అదే విధంగా జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల భారిన పడకుండా ఉపయోగపడుతుంది. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయ‌ని నిపుణులు తెలిపుతున్నారు. అలాగే జామ ఆకుల వ‌ల్ల అద్భుత‌మైన లాభాలు ఉన్నాయ‌ని కూడా చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం మరి..ఇక రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు ఉపయోగపడుతాయి. అంతే కాకుండా జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు కూడా దరికి రావు అసలు.


ఇక యాంటీ ఇన్ల్ఫ‌మేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకులు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు డయోరియా, క్యాన్సర్ వంటి సమస్యలను గ్రేట్ గా నివారిస్తాయి.


పూర్తి వివరాల్లోకి వెళ్తే జామకాయ జ్యూస్ కాలేయానికి ఒక మంచి లివర్ టానిక్ వంటిది. ఈ జ్యూస్ తీసుకొన్నప్పుడు. ఎలాంటి దుష్ప్ర‌భావ‌లు లేకుండా ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్రపట్టేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. డేంగ్యూతో బాధపడే వారికి ఈ జామ ఆకుల  జ్యూస్ ఔషధం ప‌ని చేస్తుంది. శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది. జామ ఆకు టీలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: