ఎర్రనిగా నిగ నిగ లాడే  దానిమ్మ కాయ గురించి తెలియని వారు  వుండరు. అనేక  ఔషధ లక్షణాలను తనలోదాచుకున్న దానిమ్మ  అంటే ఇష‍్టం పడనివారుఉండరంటే అతిశయోక్తి కాదు.రక్త హీనత ఆడవారి కి పెద్ద సమస్య. అటువంటి వారు  ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ జ్యూస్‌ను సేవిస్తే..రక్తహీనత నుంచి  బయటపడవచ్చని వైద్యులు చెపుతారు.

ఈ దానిమ్మ విధానాలే కాదు దానిమ్మ తొక్కలో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట. ఇక ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కాన్సర్ సైతం ఈ దానిమ్మతో దిమ్మ తిరిగేలా చెయ్యొచ్చు.

ఎందుకంటె  ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.కానీ....  దానిమ్మ కాయలు వలవడం అంటే అంత సులువు కాదు.  కొంచెం  కష్టపడాల్సిందే. దానిమ్మ రసం నిండి ఉన్న  గింజలు చితికిపోకుండా, దుస్తుల మీద గింజల రసం పడకుండా.. జాగ్రత్తగా ఒలవాలి అంటే కొంచెం ఓపిక కావాలి. ఎందుకంటే.. దానిమ్మ రసం దుస్తుల మీద పడితే... ఆ మరకలు ఒక పట్టాన పోవు.

కాబట్టి దానిమ్మ గింజలు తినాలంటే ముందు  ఒలవడానికి  ఓర్పు, నేర్పూ, సహనం  వుండాలి అంటారు. కానీ దానిమ్మని ఈజీగా వొలవడం సోషల్ మీడియాలో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే  ఎటువంటి యంత్రాలు లేకుండా ప్లాస్టిక్ బాగ్ సాయంతో దానిమ్మ రసం తీసే వీడియోలు కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం దానిమ్మ లో ఉన్న ఔషధ గుణాలతో పాటు, దానిమ్మ గింజలను  ఈజీ గా వొలుచే పద్ధతి తెలిసుకొని దానిమ్మని ఆస్వాదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: