భారత సంప్రదాయంలో ఎక్కువగా వాడే పచ్చ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అసలు పచ్చ కర్పూరం అనగానే మనకు గుడిలో ప్రసాదం గుర్తుకువస్తుంది. దీన్ని ప్రసాద్లలోనే కాదు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు.అవేంటో తెలుసుకుందామా మరి..


పచ్చకర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నోసమస్యలు తగ్గుతాయి.  తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది.  రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్యవృద్ధి జరుగుతుంది.  కళ్ళు బైర్లు కమ్మడం, తల తిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి. పచ్చ కర్పూరాన్ని రోజు ఒకటి రెండు పలుకులు తీసుకుంటే బలం, రక్తపుష్టి కలుగుతుంది. బీపీ తగ్గుతుంది. కంటి జబ్బులు, రక్త స్రావాలు అరికడతాయి. ఏ మందు వాడుతున్నప్పుడైనా ఒక పౌలు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటే ఔషధ గుణం పెరుగుతుంది.


బీపీ ఉన్నవారు రోజు రెండుసార్లు పచ్చ కర్పూరాన్ని తింటే బీపీ రాకుండా అరికడుతుంది. మూత్రం పోసేటప్పుడు మంట, చీము, సుఖవ్యాధులు ఉన్నవారు పచ్చ కర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటే బాధలన్నీ నివారిస్తాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళు మంటలు, అరికాళ్ళు, అరచేతుల మంటలు మొదలైనవాటి పచ్చ కర్పూరాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.


తెల్లకర్పూరంనే పచ్చకర్సూరం అని కూడా చాల మంది పిలుస్తారు. ఇందులో మెడిసినల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని పురాతన కాలం నుండే వాడుకలో ఉండడం గమనార్థకం. ఇందులో ఉండే మేజర్ కాంపోనెంట్స్ వల్ల ఫేమస్ విపరబ్ లలో కూడా వడుతూవుంటారు. ముక్కుదిబ్బడ మరియు జలుబు నివారించడానికి కూడా పచ్చకర్సూరంని వాడుతారు. ఈ కర్పూరం ఎసెన్సియల్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మానవులకు ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కీటకాలను, దోమల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. గాలిలో, నీటి ద్వారా వ్యాధులను వ్యాపింప చేసే దోమలను, కీటకాలను నివారణ చేస్తుంది.  కర్పూరంలో ఉండే ఘాటైన వాసన దోమలను, కీటకాలను నాశనం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: