అలోవెరా (కలబంద) ఓ ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ... అలోవెరాతో అంతకుమించిన ఎన్నో ప్రయోజనాలున్నాయి. కలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు.అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు.  జుట్టు రాలి పోయేవారికి  అలోవెరా గుజ్జునూ... కొబ్బరి నూనెనూ కలిపి... దాన్ని తలకు పట్టించడం వల్ల ఉపసమనం లభిస్తుంది. జుట్టు రిపేర్ అవుతుంది.

అలోవెరాలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు... ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే. ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగేయాలి. అది రుచికరంగా ఉండకపోయినా అలా చెయ్యడం వల్ల ఎంతో మేలు. కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఉత్తి జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుంటే సరి. అలోవెరా చర్మానికి మంచి కెల్న్జేర్ గా ఉపయోగపడుతుంది.


  కాలిన గాయాలు, వాపులకు అలోవెరా గుజ్జును రాసుకొంటే మంచి ఫలితాల్ని ఇస్తుంది.   బీపీ, షుగర్ వంటివి తగ్గేందుకు కూడా అలోవెరా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. రోజూకు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్ తాగితే... బీపీ, డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండగలవు. ఈ విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. చర్మం తెగినా, మండినా, కాలినా, వాపు వచ్చినా, కందినా, పొడిబారినా... ఇలా చర్మానికి ఏం జరిగినా... ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. 


  లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్లే ఇప్పుడు అన్ని సౌందర్య కంపెనీలూ... అలోవెరా పేస్ట్, అలోవెరా క్రీమ్, అలోవెరా సోప్, అలోవెరా కండీషనర్... ఇలా వందల కొద్దీ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. అంతంత ఖర్చుపెట్టి ఆ ఉత్పత్తులను కొనుక్కునే కంటే... ఇంట్లో ఉండే, కలబంద మొక్కను రోజూ ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని... వాడుకుంటే ఎంతో మేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: