కొందరికి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా మేలు జరుగుతుందో తెలియదు,మనం  ఊహించలేము కూడా.ఎలాంటి సంఘటన ఒకటి ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది .అస్సలు ఏం జరిగిందంటే అంటాయినెట్‌ లత్తాఫ్‌ అనే ఆమె  ఇంగ్లండ్‌లోని ‘నెట్‌వర్క్‌ టెన్‌’ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తుండేది, ఈమెకు  అనూహ్యంగా అలాంటి మేలే జరిగింది.

గత శుక్రవారం ఆమె టీవీలో ఏదో కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు, ఆమె గొంతు వద్ద తిత్తిలాగా ఉబ్బుగా కనిపించింది. దీన్ని గమనించిన వెండీ మాక్‌కాయ్‌ అనే ప్రేక్షకుడు వెంటనే ఆమెకు ఓ సందేశం పంపించారు . ‘మీ గొంతు కింద తిత్తిలాగా కనిపిస్తోంది. వెంటనే వైద్యుడికి చూపించండి, లేకపోతే ప్రమాదం’ అని తెలిపారు. 
వెంటనే  లత్తాఫ్, తమ వంశంలో ‘థైరాడ్‌ క్యాన్సర్‌’ ఉండడంతో బయపడి ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించారు.

ఆమెకి  మూడు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్‌లు చేసారు , వైద్యులు ఆమెకు ‘థైరోగ్లాసల్‌ డక్ట్‌ సిస్ట్‌’ ఉన్నట్లు తెలియచేసారు . ఈ తిత్తి స్వర పేటికపై నుండే థైరాడ్‌ గ్రంధిలో అదనపు కణాలు పెరిగి రావడం వల్ల  ఏర్పడుతుందని, అది క్రమంగా పెరగడం వల్ల శ్వాస సరిగ్గా ఆడదని, సరిగ్గా తినదీయదని, మాటలు సరిగ్గా రావని వైద్యులు చెప్పారు. వారి సలహా మేరకు లత్తాఫ్‌కు ఆమె శస్త్ర చికిత్స చేసి ఆ తిత్తిని తీసివేశారు.

ఇద్దరు పిల్లలు భర్త ఉన్న ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ‘నా పట్ల శ్రద్ధ చూపించి నా జబ్బును ముందుగా కనుక్కొని సకాలంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు’ అంటూ విక్టోరియా ప్రాంతంలో నివసిస్తున్న వెండీకి ఆమె సందేశం పంపించారు. ‘మీరు వైద్యులా, ఎలా కనిపెట్టారు?అని ’ సోషల్‌ మీడియా వెండీపై ప్రశ్నలు, ప్రశంసలు కురిపించింది. ‘అబ్బే! నేను డాక్టర్‌ను కాను, నా స్నేహితుల్లో ఒకరికి ఇలాగే ఉంది. అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గ్రహించి స్పందించానంతే!’ అని వెండీ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: