మారిన జీవన విధానంలో ఎక్కువ మందిని పట్టిపీడిస్తున్న సమస్య కొలెస్ట్రాల్‌. శరీరంలో కొవ్వు శాతం అధికం కావడమే కొలెస్ట్రాల్‌. ఇక‌నిత్యం మనం తినే పలు రకాల ఆహారాల వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని అందరికీ తెలిసిందే. అయితే 80శాతం మంది కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడటం లేదా చనిపోవడం జరుగుతున్నది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు కరిగించుకుంటూ పరిమితి దాటకుండా చూసుకోవడమే ఆరోగ్యం. అయితే థెర్మొజెనెసిస్ ద్వారా క్యాప్సికమ్ జీవక్రియ ప్రక్రియను పెంచుతాయి.


కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మామూలు మిరప కాయల్లో కేప్సేసిస్ ఉంటుంది. ఈ రసాయనం వల్లే అవి కారంగా ఉండి, క్యాలరీ లను కరిగించడంలో సహకరిస్తాయి. ఆహారంలో కారం లేని ఈ క్యాప్సికంను చేర్చుకుంటే, జీవక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సంరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు టమాటాలో కన్నా క్యాప్సికంలోనే అధికంగా ఉంటాయి. కొవ్వుక్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.


మధుమేహం నియంత్రణలో ఉంచడానికి క్యాప్సికం దోహద పడుతుంది. క్యాప్సికమ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, దీన్నిస్కిన్ బెనిఫిట్ ఫుడ్ గా కూడా పిలుస్తారు.  పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధ కారకాలు క్యాప్సికంలో ఉన్నాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి6, పోలెట్‌లు కార్టియోవాస్క్యులర్ వ్యాధులతో పోరాడడంలో సహకరిస్తాయి. వీటిలో పీచు అధికంగా లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: