అన్ని విటమిన్లు శరీరారోగ్యానికి అవసరమే అయినా ఒక్కొక్క విటమినుకి శరీరంలో ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. అయితే మానవుడి శరీరంలో డి విటమిన్ చేసేటువంటి మేలు నిజంగా ఎంతో ఉందని చెప్పొచ్చు. విటమిన్ ‘డి’ మన శరీరంలోని ఎముకలకి, గుండెకు చాలా అవసరం. డి విటమిన్ 30 నుంచి 100 యూనిట్ల వరకు ఉండడం అత్యవసరం. ఈ విట‌మిన్ లోపిస్తే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. విటమిన్ డి లోపం వల్ల మానసిక స్థితిలో తేడా ఏర్పడడం.


రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, సంతానలేమి, ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడా రావడం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరగడం, హృదయ, మూత్రపిండాల జబ్బులు వంటివి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే కీళ్లు, కండ‌రాల నొప్పులు వ‌స్తాయి.  అందుక‌ని విట‌మిన్ డి ఉన్న ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోవాల్సిందే. అయితే విటమిన్ డి మనకు కేవ‌లం సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది.


చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తీసుకోవాలి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే విట‌మిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు.వీటితో పాటు నిత్యం ఉదయాన్నే కొంత స‌మ‌యం పాటు ఎండ‌లో నిలుచుంటే చాలు మ‌న‌కు విట‌మిన్ డి అందుతుంది. అదే విధంగా విట‌మిన్ డి చ‌ర్మానికి, వెంట్రుక‌ల ఆరోగ్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: