కూల్ డ్రింక్స్ తాగితే శరీరానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా హానికర రసాయనాలను వాడతారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే గుండె సమస్యలు, బరువు పెరగటం, రక్తపోటు, కిడ్నీలో రాళ్లు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్ శరీరానికి ఎంతో హాని చేస్తాయి కానీ కొన్ని పరిశోధనల ప్రకారం శరీరానికి కూల్ డ్రింక్స్ చేసే హాని కంటే వైట్ రైస్ చేసే హాని ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. 
 
మన దేశంలోని ప్రజలకు ప్రధాన ఆహారం అన్నం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రధాన వంటకం అని తెలిసిందే. పాలిష్ చేయని అన్నాన్ని తీసుకుంటే మన శరీరానికి ఎంతో మంచిది. పాలిష్ చేయని అన్నంలో మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి. కానీ పాలిష్ చేసిన అన్నంలో మన శరీరానికి ఉపయోగపడే పోషకపదార్థాలు ఏమీ ఉండవు. మిల్లుల్లో బియ్యం బాగా మెరవడానికి పాలిష్ చేస్తారు. 
 
కానీ ఈ పాలిష్ చేసిన బియ్యం వలన శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాలిష్ చేసిన బియ్యం తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలిష్ చేసిన బియ్యంలో చక్కెర ఎక్కువ శాతంలో ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నాన్ని తినడం వల్ల శరీరంలోకి గ్లూకోజ్ చేరి షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలో పెరిగే షుగర్ కంటే పాలిష్ చేసిన అన్నంలో ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువ. 
 
 బ్రౌన్ రైస్ లేదా లావు బియ్యంతో చేసిన అన్నం శరీరానికి వైట్ రైస్ తో పోలిస్తే మంచిది. బ్రౌన్ రైస్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి డాక్టర్లు బ్రౌన్ రైస్ తినమని చెబుతుంటారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: