ఉల్లికాడల ఖరీదు తక్కువే అయినా ఆరోగ్యం ఎక్కువ‌. ఉల్లిపాయల్ని కొనలేక, తినలేక బాధపడుతున్నాం అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి.  కెలొరీలూ కొవ్వూ తక్కువగా... పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడల్ని తరచూ తినే వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. డైటరీ ఫైబర్‌ అంటే ఆహార సంబంధిత పీచు వీటి నుంచి సమృద్ధిగా అందుతుంది. అది ఆకలిని అదుపులో ఉంచుతుంది. 


దీనిలో ఉన్న యాంటీబాక్టీరియల్ జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. స్థూల పోషకాలు ఉండటం వల్ల జీవక్రియ నియంత్రణకు పనికొస్తుంది. కీళ్ల నొప్పులు, ఉబ్బసం ఉన్నవారికి ఇదొక దివౌషధం. ఉల్లికాడ‌ల్లో సి, బి 2, ఎ, కె విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా.. వీటిలోని అధిక సల్ఫర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును మెరుగుపరుస్తుంది.


ఉల్లికాడల్లోని గ్జియాంతిన్‌ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది. హానికారక కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. గర్భిణిగా ఉండగా తొలి మూడునెలల్లో వీటిని తరచూ తినడం వల్ల, కడుపులో బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. అలాగే  వీటిలోని ఉండే క్రోమియం కంటెంట్ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వెన్నుముక సమస్యలు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. కాలేయం చుట్టూ పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: