చర్మ సౌందర్యంపై మహిళలకు పట్టింపు ఎక్కువ. అయితే.. అందుబాటులోఉండే సహజపదార్థాలు మన సౌందర్యాన్ని పెంచుతాయన్న సంగతి చాలామందికి తెలియదు. అలాంటి వాటిలో కలబంద ఒకటి. దీన్ని వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదెలాగంటే..


కలబంద గుజ్జు, చేసి పెట్టుకోవాలి. దానికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె, ఆముదం, కొన్ని మెంతులు అందులో వేసి మరిగించాలి. బాగా వేడయ్యాక తీసి చల్లార్చి ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీన్ని తలస్నానం చేసే గంట ముందు జుట్టుకి పట్టించి మర్దన చేయాలి.


ఇలా చేస్తే వెంట్రుకలకు తగిన పోషణ అంది. ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇక అలాగే.. ముఖంపై మచ్చలు తగ్గాలంటే పావు కప్పు కలబంద గుజ్జులో కొద్దిగా తేనె, చెంచా తులసిపొడి కలపాలి. దాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట ఉంచి కడిగేసి నిద్రపోవాలి.


చర్మం నిగనిగ మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ అమ్మాయిలైతే.. ఈ సింగారం మరంత ఎక్కువ. అందుకోసం చర్మం మెరిసిపోవాలనీ, జుట్టు నిగనిగలాడిపోవాలని వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే ఇలాంటి నేచురల్ పద్దతు ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: