రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే జామకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది. కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను " సి ష జామ‌లో ఉంటుంది. ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది. అయితే రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.


జామాకుల‌కు నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ముఖ్యంగా జామాకుల టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.


జామఆకుల వల్ల మరో గ్రేట్ హెల్త్ బెనిఫిట్, డేంగ్యూతో బాధపడే వారికి ఈ లీఫ్ జ్యూస్ ఔషధం వంటిది . శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది. జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే వీరకణాల ఉత్పత్తి పెరుగుతుంది. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి జామకాయ జ్యూస్ కాలేయానికి ఒక మంచి లివర్ టానిక్ వంటిది. ఈ జ్యూస్ ను తీసుకొన్నప్పుడు. ఎలాంటి దుష్ర్పభాలు లేకుండా ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: