ఒకప్పటి మనుషులను తీసుకుంటే హ్యాపిగా వందేళ్లూ బ్రతికారు. కాని ఇప్పటి పరిస్దితుల్లో మహా అంటే 60 సంవత్సరాలు మాత్రమే మనిషి బ్రతుకుతాడని అంత కాదంటే ఇంకో పది సంవత్సరాలు కలుపుకుంటే 70 ఏళ్లు మాత్రమే బ్రతుకుతారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీనికి రకరకాలైన కారణాలున్నాయి. వాతావరణం కలుషితమవ్వడం, మందులకు లొంగని రోగాలు, కల్తీ ఆహారపదార్ధాలు స్వీకరించడం మొదలైన కారణాలతో మనిషి జీవితకాలం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.


వీటికి తోడు వ్యభిచారాల మూలంగా కూడా రోగాలు వస్తున్నాయి. ఇలా వచ్చే వ్యాధి పేరు ఎయిడ్స్ ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఇప్పుడు దీనికంటే ప్రమాదకరమైన వ్యాధి వస్తుందట అదేమంటే గ‌నేరియా. ఈ రోగం కూడా ఎయిడ్స్ లాగే మారుతుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి కోసం ఇస్తున్న యాంటీ బ‌యోటిక్ మందులు రోగిపైన ఏమాత్రం ప‌నిచేయ‌డం లేద‌ట‌. ఆ మందుల‌కు కూడా బాక్టీరియా త‌ట్టుకుని నిల‌బ‌డుతుంద‌ని, దీంతో ఆ బాక్టీరియా సూప‌ర్ బ‌గ్‌గా మారింద‌ని, దాన్ని నాశ‌నం చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని సైంటిస్టులు చెబుతున్నారు..


దీని బారిన ప‌డి అనేక మంది ప్రాణాల‌ను కూడా కోల్పోతున్న‌ట్లు వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక ఈ వ్యాధి రావడానికి కారణం  సుర‌క్షిత‌మైన శృంగారం లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఆ వ్యాధి ఉన్న‌వారితో సేఫ్‌గా శృంగారంలో పాల్గొన‌క‌పోవ‌డం వ‌ల్ల ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సంక్రమిస్తుంది.. ఈ వ్యాధి రావ‌డానికి నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా కార‌ణం.సెక్స్ లో పాల్గొన్న 2 నుంచి 5 రోజుల్లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయట.


మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంతేకాకుండా కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి.


ఇకపోతే ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌నేరియా బాధితులు పెరుగుతుండ‌గా ఈ వ్యాధి ప‌ట్ల వైద్య ప్ర‌పంచం ఆందోళ‌న చెందుతోంది.కానీ దీని గురించి ఇంకా చాలా మందికి తెలియ‌డం లేదు.అది విచారించద‌గిన విష‌యం.ఏటా అనేక కోట్ల మందికి గ‌నేరియా వ్యాధి సోకుతూ ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చ‌రిస్తోంది. కాబట్టి ఈ వ్యాధి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: