చాలామంది భోజన ప్రియులు వారానికి రెండు మూడు రోజులు మాంసం తింటూ ఉంటారు. సరిగ్గా ఉడికిన మాంసం ఉంటే ఎటువంటి నష్టం లేదు కాని సరిగ్గా ఉడకని లేదా పచ్చి మాంసం తింటే మాత్రం శరీరంలోకి బద్దెపురుగులు (టేప్ వార్మ్ లు) ప్రవేశించే అవకాశముంది. బద్దెపురుగు చాలా ప్రమాదకరమైనది. బద్దె పురుగులు శరీరంలోకి చేరితే ఈ పురుగులు బ్రెయిన్ ను కూడా చేరే అవకాశం ఉంది. 
 
బద్దె పురుగు మెదడులోకి చేరితే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అమెరికా, చైనాలాంటి దేశాలలో ఇటువంటి కేసులు ఇప్పటికే చాలా నమోదు అయ్యాయి. మాంసాన్ని వండే ముందు శుభ్రత పాటించాలి. ఉడకని మాంసం తీసుకుంటే బద్దెపురుగుల గుడ్లు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రోడ్లపై అమ్మే తినుబండారాలను తినటం వలన కూడా ఈ పురుగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. 
 
తలనొప్పి రెగ్యులర్ గా వచ్చే వారు ఎన్ని మందులు వాడినా తలనొప్పి తగ్గకపోతే బ్రెయిన్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. మీకు తెలియకుండానే మీ శరీరంలోకి బద్దెపురుగులు చేరే అవకాశం ఉంది. మాంసం విషయంలో గర్భవతులు అత్యంత జాగ్రత్త వహించాలి. గర్భవతులు సరిగ్గా ఉడకని మాంసం తింటే పుట్టే పిల్లల మెదడు పెరుగుదలను టోక్సోఫ్లోస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ దెబ్బ తీస్తుంది. సరిగ్గా ఉడకని చికెన్ తింటే పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
మాంసం తినే ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆరోగ్య నిపుణులు నిల్వ చేసిన జంతు మాంసం, ప్రాసెస్ చేసి ప్యాకింగ్ రూపంలో వచ్చే మాంసం, ఎరుపు రంగులోకి మారిన మాంసం తింటే పేగు కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: