మనందరం ఇప్పటివరకు క్యాబేజీతో వంటలు రక రకాలుగా చేసుకుని తినే ఉంటాం. ఈ క్యాబేజీ తినడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు అందుతాయి. దీన్ని విటమిన్లకు నెలవుగా చెప్పవచ్చు. విటమిన్ ఎ, బి1, బి2, బి6, ఇ, సి, కె తదితర విటమిన్లతోపాటు కాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం, సల్ఫర్, పాస్ఫరస్, ఫోలేట్ తదితర పోషకాలు కూడా క్యాబేజీలో సమృద్ధిగా ఉంటాయి.


ఇకపోతే ఈ కాలంలో కొంచెం వయసు పై బడిన వారిని కదిపితే చాలు తరచుగా వినపడే మాట మోకాళ్ల నొప్పులు.. ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు, ఎక్సర్సైజ్లు, రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.. ఇక ఇప్పటికే మారిన జీవన ప్రమాణాలు, ఆహరపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి అన్ని అనారోగ్య సమస్యలకు మందులొక్కటే పరిష్కారం కావు, ఇందుకు గాను మన ఇళ్లల్లో ఉండే కొన్ని రకాల పదార్దాలు మన సమస్యలకు పరిష్కాలను చూపుతాయి.


అలాంటి వాటిల్లో ఒకటి క్యాబేజి… ఈ క్యాబేజీ ఆకుల మీద కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ వారు చేసిన పరిశోధనలో మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయన్నది రుజువైంది.. అదేలా అంటే కాళ్లు నొప్పులుగా ఉంటే రెండు క్యాబేజీ ఆకులను తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడగి, ఆరబెట్టాలి. తర్వాత ఇంట్లో ఉండే చపాతీల కర్రతో చపాతీలు చేస్తున్న తీరులో ఆకు కాస్త మెత్తపడే వరకు రుద్దాలి. కాస్త నలిగినట్లు అయి రసం బయటకు వచ్చేంత వరకు రుద్దితే మంచిది.


ఇదంతా రాత్రి పడుకునే ముందు చేయాలి. అలా చిదిమిన ఆకులను మోకాలిపై పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్ తో చుట్టేయాలి. ఒకమోకాళ్ల నొప్పులే కాకుండా కాలిపై ఇతర బాగాల్లో నొప్పిగా ఉంటే కూడ అక్కడ ఇలా పెట్టినా సరిపోతుంది. ఇక తిరిగి ఉదయాన్నే ఆ బ్యాండేజీని తొలగించాలి. ఇలా ప్రతి రోజు కొత్తగా మళ్లీ క్యాబేజీ ఆకులను తీసుకొని రాత్రి పూట ఓ నెలపాటు రోజూ ఇలా  చేస్తుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: