లవంగం అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. వంటల్లో లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. లవంగాలు వంటలకే కాక పలు ఆరోగ్యకర ప్రయోజనాలు ఇచ్చే ఔషధంగా కూడా పనిచేస్తాయి. బిర్యానీ తయారీలో, మాంసాహార కూరల్లో లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వ్యవసాయ, కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో కూడా లవంగాలను ఉపయోగిస్తారు. 
 
రోజూ లవంగాలను తింటే మానవ శరీరానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ లవంగాలను తినటం ద్వారా అల్సర్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. లవంగాలు తినటం ద్వారా స్కిన్, లివర్ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. లవంగాలు బీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచటంతో పాటు తలనొప్పిని కూడా తగ్గిస్తాయి. లవంగాల్లో ఉండే యూజెనాల్ అనే నూనె నొప్పి, వాపు తగ్గిస్తుంది. 
 
లవంగాలు శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో బాగా పని చేస్తాయి. జలుబు, దగ్గులాంటి సమస్యలు కూడా లవంగాలు తీసుకుంటే దూరమవుతాయి. లవంగాలు తినటం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. కొంతమందికి ప్రయాణాలు చేసే సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు రెండు, మూడు లవంగాలను తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. 
 
రోజూ లవంగాలను తింటే చిగుళ్ల సమస్యలు, దంత సమస్యలు రావు. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు వస్తే లవంగాలను పొడిగా చేసుకొని ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: