పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహారం అత్యవసరమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం వరకూ దేశంలో వ్యవసాయం 80శాతం ఉంటే ప్రస్తుతం 60 కంటే తక్కువకు పడిపోయిందని వ్యవసాయ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయంపై రైతులకు నష్టాలు ఎక్కువ కావడం, నేటి తరం వ్యవసాయంపై విముఖత చూపించడమే ఇందుకు ముఖ్య కారణం. సేంద్రీయ పద్ధతుల్లో పండించే పంట కంటే ఎరువులతో పండించే పంటలు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రజా ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.


ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు ఎక్కువగా ఉంటోంది. పండిన పంటకు గిట్టుబాటు ధర రాని రైతులు వాటిని కార్పొరేట్ సంస్థలకు వచ్చిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. మరికొందరు రైతులు పంటను పాడేసుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే అదనుగా కార్పొరేట్ సంస్థలు రైతులను డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంటున్నారు. గత ఏప్రిల్ నెలలో బంగాళదుంపలు పండించే రైతులపై పెప్సీకో కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని సబర్ కాంతా, ఆరవల్లి జిల్లాల్లోని తొమ్మిది మంది రైతులపై పెప్సీకో ఇండియా కంపెనీ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేసే పరిస్థితులు వచ్చేశాయి. దీనికి తోడు పంటలను కూడా ఎరువులతో పండించడంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోంది.


ప్రజలు కూడా ఆహార నాణ్యతను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఫైబర్ కలిసిన ఆహారపదార్ధాలను సైతం ప్యాకింగ్ లో ఉంటే వాటినే తీసుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల వ్యాపార సరళి, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం ఆహార నాణ్యతపై ప్రభావం చూపుతోంది. మాల్స్ లో, కొన్ని మార్కెట్లలో కూరగాయల ధరలకు, సేంద్రీయ కూరగాయలు ప్రత్యేకంగా విక్రయించే స్టోర్లలో ధరల వ్యత్యాసమే ఇందుకు ఉదాహరణ. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించి రైతులకు గిట్టుబాటు ధరలు అందించినప్పడు, రైతు సంతోషంగా ఉన్నప్పుడే తినే ఆహరంలో నాణ్యత ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: