కల్తీ కల్తీ కల్తీ... ప్రస్తుతం దేశంలో ఏ వస్తువులు చుసిన కల్తీ  కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏ  వస్తువులో  నాణ్యత ప్రమాణాలు  కనిపించడం లేదు. ప్రతి వస్తువులో  కల్తీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అటు దేశంలోని ప్రజలు కూడా కల్తీకి అలవాటు పడిపోతున్నారు. కల్తీ ఆహారం కల్తీ వస్తువులతో  ప్రస్తుతం మానవ జీవితమే కల్తీ అయిపోతుంది. మొన్నటివరకు వాడుకునే వస్తువులు లోనే  కల్తీని చూసాం . నాణ్యతలేని కల్తీ వస్తువులను కొన్నాం వాడాం . కానీ ఇప్పుడు ఈ కల్తీ యవ్వారం మనుషులు తినే ఆహారం వరకు వచ్చింది. ఇప్పుడు మనుషులు తినే ఆహారంలో కూడా నాణ్యత కరువైంది. 

 

 

 

 ప్రతి చోట కల్తీ  జరుగుతుంది. తినే అన్నం లో కల్తీ తాగే నీటిలో కల్తీ . జనాలు ఎక్కువగా ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు ఫలాలు తింటూ ఉంటారు. ఇప్పుడు కూడా పండ్లు ఫలాలను  తింటున్నారు. అయితే ప్రజలు ఆరోగ్యం వస్తుందనుకుంటుంటే..  పండ్లు  తినడం వల్ల  కూడా అనారోగ్యం వస్తుంది.కారణం కల్తీ.  పండ్లు ఫలాలలో  కూడా పూర్తి కల్తీ అయిపోయాయి . ప్రకృతి సిద్దంగా పండిన పండ్లను  కాకుండా రసాయనాల ద్వారా పండిన పళ్లను ప్రస్తుతం దేశ ప్రజానీకం తింటోంది. ఎక్కువ పండ్లు తింటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్న డాక్టర్లే...  ప్రస్తుతం అవే పండ్లు  ఎక్కువ తింటే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే మనుషుల ప్రాణాలకు హాని కలిగించే రసాయనాలతో ప్రస్తుతం పండ్లను మగ్గించి  అమ్ముతున్నారు వ్యాపారులు. 

 

 

 

 దీంతో ఆరోగ్యాన్నిచ్చే పండ్లు ఫలాలు కొనాలన్నా 100సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పండు తింటే ఏ రోగం వచ్చి పడుతుందో  అని ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న పండ్ల పరిస్థితి. మార్కెట్లో దొరుకుతున్న పనులన్నీ పైన కు నిగనిగలాడుతూ ఫ్రెష్  ఉన్నప్పటికీ లోపల మాత్రం రసాయనాలతో ఫుల్లుగా నిండి  ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాయి . ఇప్పటికే రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంటే...  ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పండ్లు తిందామంటే అక్కడ కూడా కల్తీ ఏర్పడటంతో  మనిషి ఆయుష్షు రోజురోజుకి  మరింత తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: